Published : 04/03/2021 03:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మహిళలపై హింస పెరగడం దురదృష్టకరం


మాట్లాడుతున్న దత్తాత్రేయ వేదికపై వెంకటరత్నం, సునీత తదితరులు

నారాయణగూడ: కొవిడ్‌ కాలంలో మహిళలపై గృహహింస, అత్యాచారాలు, దాడులు పెరిగాయని.. ఇది దురదృష్టకరమని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు బుధవారం బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌లోని భాస్కర ఆడిటోరియంలో తెలంగాణ సైకాలజిస్ట్‌ అసోసియేషన్‌(టీపీఏ) ఆధ్వర్యంలో పురస్కారాలు ప్రదానం చేశారు. టీపీఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఎం.రామచందర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. మహిళల భద్రతకు ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తే సరిపోతుందన్నారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న సమాజంలో మార్పు తెచ్చే బాధ్యత సైకాలజిస్టులు తీసుకోవాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీత మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్‌ కేంద్రాలను బలోపేతం చేయడానికి యత్నిస్తోందని, వాటిలో ఎంఏ సోషల్‌ వర్కర్స్‌తో పాటు సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులకు అవకాశం కల్పించే విషయమై ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. మహిళా కమిషన్‌ పూర్వ ఛైర్‌పర్సన్‌ డా.త్రిపురాన వెంకటరత్నం, రామచందర్‌ మాట్లాడుతూ.. సైకాలజిస్ట్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.జి.పద్మజ, గాయని బి.విజయలక్ష్మి, సంఘం ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని