Published : 04/03/2021 03:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోరం లేక జడ్పీ సమావేశం వాయిదా

సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్న జడ్పీ సీఈఓ ఉష

వికారాబాద్‌, న్యూస్‌టుడే: పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రచారంలో అధికార తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు తలమునకలై ఉండటం, జిల్లాలో మంత్రి టి.హరీష్‌రావు, పి.సబితారెడ్డి ప్రచారం కార్యక్రమాలు ఉండటంతో బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. 18 మంది జడ్పీటీసీ సభ్యులకు అధికార పార్టీకి చెందిన వారు 16 మంది, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. పలు శాఖలకు చెందిన అధికారులు, జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి మినహా జడ్పీటీసీ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జడ్పీ సీఈఓ ఉష ప్రకటించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని