Published : 05/03/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రైతు సంఘాల మహిళల అభ్యున్నతే లక్ష్యం: కలెక్టర్‌


కేసారంలో పర్యటిస్తున్న పౌసుమిబసు

మోమిన్‌పేట, న్యూస్‌టుడే: రైతు సంఘాల మహిళలు ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా పాలనాధికారిణి పౌసుమిబసు సూచించారు. గురువారం మండల పరిధి కేసారం, మోమిన్‌పేటలో ఆమె పర్యటించారు. కేసారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మోమిన్‌పేట అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కేంద్రంలో సెర్ప్‌ సిబ్బంది, కేంద్రం అధ్యక్ష, ఉపాధ్యక్షులు డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాభాలు ఆర్జించాలంటే విపణిలో డిమాండ్‌ ఉండే కూరగాయలు సాగు చేసే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. కూరగాయలను రైతు ఉత్పత్తి దారుల కేంద్రంలో విక్రయిస్తే, విపణిలో లభించే ధర కంటే ఎక్కువ చెల్లిస్తారని, కేంద్రానికి వచ్చిన లాభాల్లో 50 శాతం వాటా చెల్లిస్తామని రైతులకు వివరించాలన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఎంపీడీవో శైలజారెడ్డిని ఆదేశించారు. మురుగు కాలువల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందంటూ పరిసరాల పరిశుభ్రతపై దృష్టి కేంద్రికరించాలని, పాత బావులును పూడ్చివేయాలని ఎంపీవో యాదగిరికి సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఎ కృష్ణన్‌, డీఎల్‌పీవో అనిత, డీపీఎం శ్రీనివాస్‌ ఎఫ్‌పీసీ అధ్యక్ష ఉపాధ్యక్షురాలు లక్ష్మి, ప్రమీల ఎపీఎంలు శివయ్య, రాజు సెర్ప్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని