
1,525 క్వింటాళ్ల వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం
తాండూరు, న్యూస్టుడే: తాండూరు వ్యవసాయ విపణిలో గురువారం రైతులు 1,525 క్వింటాళ్ల వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించారు. వాటిలో 1200 క్వింటాళ్ల కందులు, 156 క్వింటాళ్ల శనగలు, 169 క్వింటాళ్ల వేరుసెనగ కాయలు ఉన్నాయి. క్వింటాలు కందులకు గరిష్ఠంగా రూ.7,089, కనిష్ఠంగా రూ.6,007, సగటు ధర కింద రూ.6,993 లభించింది. శనగలకు గరిష్ఠంగా రూ.4,959, కనిష్ఠంగా రూ.4,860 సగటు ధరగాను రూ.4,950 పలికింది. వేరుసెనగ కాయలకు గరిష్ఠంగా రూ.6,750, కనిష్ఠంగా రూ.6,309 సగటు ధరగా రూ.6,651 చొప్పున లభించిందని విపణి ఇన్ఛార్జి కార్యదర్శి హబీబ్ అల్వీ తెలిపారు.
Tags :