Published : 05/03/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మంత్రి ప్రారంభించిన ఆసుపత్రి.. వైద్యం అందని వైచిత్రి

రిగిలో రూ.3.5 కోట్ల అంచనా వ్యయంతో రెండేళ్ల కిందట సామాజిక ఆసుపత్రి భవనాన్ని నిర్మించారు. దీనిని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఇక మెరుగైన వైద్యం అందుతుందని ప్రజలు ఆశించారు. ఇప్పటివరకు వినియోగంలోకి తీసుకురాకపోవడంతో రోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. స్థాయి పెంచి సత్వరం సేవలను ప్రారంభించేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, పరిగి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని