
పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ వినోద్
హైదరాబాద్: న్యాయం చేయాలని కోరుతూ జబర్దస్త్ వినోద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ‘‘ప్రస్తుతం నివాసం ఉంటున్న అద్దె ఇంటిని విక్రయిస్తామని యజమాని రూ.40లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.13.40లక్షలు అడ్వాన్సు కూడా తీసుకున్నారు. ఇప్పుడేమో రూ.40లక్షల కంటే ఎక్కువ ఇస్తేనే ఇల్లు అమ్ముతానని, లేని పక్షంలో అడ్వాన్సుగా ఇచ్చిన రూ.13.40లక్షలు కూడా తిరిగి ఇవ్వమని బెదిరిస్తున్నారు. గతంలో భౌతిక దాడి చేశారు. దాడి ఘటనపై అప్పట్లో కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాకు న్యాయం చేయండి’’ అని డీసీపీకి అందజేసిన వినతిపత్రంలో వినోద్ పేర్కొన్నారు.
Tags :