Published : 12/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సామాజిక న్యాయానికి పాటుపడ్డ ఫులే

ఫులేకు జాజుల నివాళి

అంబర్‌పేట, న్యూస్‌టుడే: పేదరికం, అణచివేత, అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించి సామాజిక న్యాయానికి పాటుపడ్డ మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫులే అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కొనియాడారు. ఆదివారం అంబర్‌పేట అలీకేఫ్‌ చౌరస్తాలోని ఫులే విగ్రహం వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, ఫులే జయంత్యుత్సవ కమిటీ ఛైర్మన్‌ శేఖర్‌సగర ఆధ్వర్యంలో జరిగిన ఫులే జయంతి కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆనాడే ఆయన మహిళా విద్య ప్రాధాన్యాన్ని గుర్తించారని పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ దృశ్య శ్రవణ సందేశాన్ని ఇచ్చారు. ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు, తెలంగాణ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, తెలంగాణ బీసీ సంఘాల ఐకాస ఛైర్మన్‌ కుందారం గణేశ్‌చారి, కత్తి వెంకటస్వామి తదితరులు మాట్లాడారు. విజయ్‌కుమార్‌గౌడ్‌, దూసరి లావణ్య, శ్రీనివాస్‌గౌడ్‌, బడేసాబ్‌, శంభుల శ్రీకాంత్‌గౌడ్‌, మహమ్మద్‌ గౌస్‌, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని