Published : 12/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ బిల్లు సాధనకు దిల్లీ ముట్టడి

జ్యోతిబా చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బీసీ నేత

ఆర్‌.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, వెంకటేశ్‌, భూపేశ్‌సాగర్‌ తదితరులు

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: బీసీ బిల్లు కోసం మూడు దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఫులేను స్ఫూర్తిగా తీసుకుని బిల్లు సాధనకు దిల్లీని ముట్టడించనున్నట్లు తెలిపారు. మహాత్మ జ్యోతిబాఫులే జయంతిని పురస్కరించుకుని ఆదివారం బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన సభ నిర్వహించారు. ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన కేంద్రం, బీసీ బిల్లు ప్రవేశపెట్టకపోవడం తగదన్నారు. బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్‌, గ్రేటర్‌ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరడి భూపేశ్‌సాగర్‌, జాతీయ కార్యదర్శి కోలా జనార్దన్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని