Published : 12/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘బీసీని ప్రధానిని చేసింది భాజపానే’

నివాళులర్పించి నినాదాలు చేస్తున్న గీతామూర్తి, డాక్టర్‌ లక్ష్మణ్‌,

ఎడ్ల సుధాకర్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్‌, గౌతంరావు, వినోద్‌యాదవ్‌

అంబర్‌పేట, న్యూస్‌టుడే: బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీని దేశ ప్రధానిని చేసిన ఘనత భాజపాకే దక్కుతుందని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతిని పురస్కరించుకుని ఆదివారం అంబర్‌పేట అలీకేఫ్‌ చౌరస్తాలోని విగ్రహం వద్ద భాజపా నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్‌, కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర సమన్వయకర్త ఆనంద్‌గౌడ్‌, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, భాజపా హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వినోద్‌యాదవ్‌ తదితరులతో కలిసి ఆయన ఫులేకు నివాళులర్పించారు. నేతలు నాగభూషణంచారి, యశ్వంత్‌, పత్తి అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని