Updated : 12/04/2021 06:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార్యను కొడుతూ కింద పడి భర్త మృతి

చేతిలో చిల్లిగవ్వ లేక మార్చురీలోనే మృతదేహం

దీనంగా చూస్తున్న ఉషారాణి, పిల్లలు

చైతన్యపురి, నాగోలు, న్యూస్‌టుడే: మద్యం మత్తులో భార్యను కొడుతూ అదుపుతప్పి భవనంపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చైతన్యపురి ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టరు రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రసాద్‌ (34) తాపీమేస్త్రీ. కొన్నేళ్ల క్రితం భార్య ఉషారాణి పిల్లలతో నగరానికి వచ్చి కొత్తపేటలో అద్దెకు ఉంటున్నాడు. మద్యానికి బానిసైన ప్రసాద్‌ తరచూ భార్యతో గొడవపడేవాడు. శనివారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న ప్రసాద్‌ భార్యపై దాడి చేసే క్రమంలో అదుపుతప్పి అద్దెకు ఉండే 2వ అంతస్తు నుంచి మొదటి అంతస్తులో పడిపోవడంతో తలకు బలమైన గాయమై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు పంచనామా అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
అంత్యక్రియలు చేసే స్తోమత కూడా లేక..
ప్రసాద్‌, ఉషారాణి తండ్రి ఇరువురు మేస్త్రీలు కావడంతో ఆ పరిచయంతో కుమార్తెను ఇచ్చి 13 ఏళ్ల క్రితం అతనితో వివాహం జరిపించాడు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. ప్రసాద్‌ మద్యానికి అతిగా ఖర్చు చేయడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. దీంతో భార్య ఉషారాణి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో మృతదేహాన్ని తీసుకురాలేని దుస్థితి. చైతన్యపురి పోలీసులు రూ.500 ఇచ్చి భార్యా పిల్లలకు భోజనం ఏర్పాటుచేశారు. దహన సంస్కారాలు చేయడానికి కూడా స్తోమత లేక భార్యా పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మృతుడి తల్లితండ్రి కూడా ముందుకు రాకపోవడంతో పోస్టుమార్టం అనంతరం ఉస్మానియా ఆసుపత్రి శవాగారంలో మృతదేహాన్ని ఉంచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని