Updated : 12/04/2021 07:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసం

రూ.1.15 కోట్లు వసూలు.. నిందితుడిపై పదుల సంఖ్యలో కేసులు


రాజేష్‌

రామచంద్రాపురం రూరల్‌: ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న రాజేష్‌.. అలియాస్‌ రమేష్‌ను రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ జగదీశ్వర్‌ తెలిపిన ప్రకారం.. అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం రాచవారిపల్లికి చెందిన కొండూరి రాజేష్‌ చౌదరి ప్రకాశం జిల్లా కందుకూరు గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు మల్లికార్జునరావు కుమార్తె తేజస్వినికి భెల్‌ పరిశ్రమలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. పలు దఫాలుగా రూ.5,52,700 నగదు వసూలు చేశాడు. అదేవిధంగా భెల్‌ పరిధిలోని అపర్ణ, సమ్రీన్‌, ఆదర్శ, శిరీషల నుంచి రూ.1.10 కోట్లు వసూలు చేసి ముఖం చాటేశాడు.  
గతంలోనూ..  మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, చైతన్యపురి పోలీస్‌స్టేషన్ల పరిధిల్లో గతంలో ఇతనిపై 14 రకాల మోసాల కేసులు నమోదయ్యాయి. స్నేహితుడి పేరుతో క్రెడిట్‌ కార్డులు వాడుకున్నాడు. దానిపై బెంగళూరులో కేసు నమోదైంది. గతంలో భెల్‌ పరిశ్రమలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నగరానికి చెందిన ఫణీందర్‌, నౌశికల వద్ద నుంచి రూ.36,48,287లు వసూలు చేశాడు. మరో 13 మంది నుంచి డబ్బులు వసూళ్లు చేసినందుకు నాలుగు పోలీస్టేషన్‌లలో కేసులున్నాయి. చండీఘడ్‌కు పరారయిన రాజేష్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని