Published : 12/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాలాల్లో ప్లాస్టిక్‌ కవర్లు, పరుపులు

పూడికతీతలో బయటపడిన పరుపు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలోని నాలాలు, డ్రెయిన్లలో చేపట్టిన పూడిక పనుల్లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ బాటిళ్లు, కవర్లు, చెప్పులు, పరుపులు, కవర్లు, గాజు ముక్కలు బయట పడుతున్నాయి. నగరంలోని నాలాల్లో విచ్చలవిడిగా బాటిళ్లు, కవర్లు వేయడంతో జీహెచ్‌ఎంసీ చేపట్టిన పూడికతీత పనుల సందర్భంగా తీసే వ్యర్థాల్లో దాదాపు 20శాతంకు పైగా ప్లాస్టిక్‌ సంబంధిత పదార్థాలే ఉంటున్నాయని ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరంలో 356 నాలాల పూడికతీత పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ పనులను మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతీ జోన్‌కు ప్రత్యేకంగా ఒక ముఖ్య ఇంజినీర్‌ను పర్యవేక్షక అధికారిగా జీహెచ్‌ఎంసీ నియమించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని