Published : 12/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వాగులోకి టిప్పర్‌.. డ్రైవర్‌ మృతి

వంతెనల మధ్య పడిన టిప్పర్‌ లారీ

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొత్తగూడెం వద్ద జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌65)పై ఉన్న వాగులోకి టిప్పర్‌ లారీ తలకిందులుగా పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చౌటుప్పల్‌ వైపు నుంచి ఆదివారం సాయంత్రం నగరానికి వస్తున్న టిప్పర్‌ లారీ  కొత్తగూడెం వద్ద ఉన్న వంతెనల ప్రాంతానికి చేరుకోగానే అదుపుతప్పింది. రెండు వంతెనల మధ్యకు దూసుకెళ్లి ఆనక వాగులో పడిపోయింది. లారీ క్యాబిన్‌లో డ్రైవర్‌ ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రక్షించేందుకు పోలీసులు 108 సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ పి.శివరాజ్‌గౌడ్‌(46) అనంతరం ప్రాణాలు విడిచాడు. డ్రైవర్‌ శివరాజ్‌గౌడ్‌ స్వస్థలం మాడ్గుల మండలం కొలుకులపల్లి గ్రామంగా గుర్తించారు. మరోవైపు, జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించడంతో పోలీసులు క్రమబద్ధీకరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని