Published : 12/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పండుగ ముందు విషాదం

ఉగాదికి ఊరెళ్తూ ప్రమాదం.. ముగ్గురి మృతి

భార్యాపిల్లలతో మురళీమోహన్‌రెడ్డి

ఇటిక్యాల, న్యూస్‌టుడే : ఉగాది పండగకు సొంతూరికి వెళుతూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ వద్ద ఆదివారం జరిగింది. కోదండాపురం ఎస్సై కృష్ణయ్య కథనం ప్రకారం వివరాలు.. కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రపల్లికి చెందిన మురళీమోహన్‌రెడ్డి(50) కుటుంబం నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో స్థిరపడింది. ఉగాది సందర్భంగా భార్య సుజాత(45), కుమార్తె నేహారెడ్డి(13), కుమారుడు సూర్యతేజారెడ్డితో కలిసి కారులో ఆదివారం ఉదయం హైదరాబాదు నుంచి సొంతూరికి బయలుదేరారు. ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ వద్ద ముందు వెళుతున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి డివైడర్‌పైకి ఎక్కిన కారు..బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. బొలేరో వాహనం ముందు వెళుతున్న లారీని ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ  మురళీమోహన్‌రెడ్డి, సుజాత, నేహాలు చికిత్స పొందుతూ మృతి చెందారు.  సూర్యతేజారెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు. బొలేరో డ్రైవర్‌ సీతయ్యతోపాటు అందులోని సునీల్‌కుమార్‌, రాజుకు స్వల్ప గాయాలైనట్లు ఎస్సై తెలిపారు.
కేపీహెచ్‌బీలో విషాదఛాయలు
కేపీహెచ్‌బీకాలనీ: మురళీమోహన్‌రెడ్డి మృతితో కేపీహెచ్‌బీ మూడోఫేజ్‌లోని భువన విజయం మైదానం సమీపంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం రాత్రి వరకు తమతో కలిసి ఉన్న వ్యక్తి ఇక లేడనే వార్తను దిగమింగుకోలేకపోతున్నామంటూ ఆయన మిత్రులు కంటతడి పెట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని