Published : 12/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాలుడిని ఆదుకుంటాం

ట్విటర్‌ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్‌


నిషాంత్‌ను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు

మౌలాలి, న్యూస్‌టుడే: మౌలాలిలో విద్యుత్తు నియంత్రికకు తగిలి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న బాలుడు నిషాంత్‌(8)ను ఆదుకుంటామని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బాలుడి పరిస్థితిని ఓ నెటిజన్‌ ట్విటర్‌ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు. వెంటనే తన కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. మౌలాలి ఈస్ట్‌ మారుతీనగర్‌లో అద్దెకు ఉండే జానకి కుమారుడు ఆడుకుంటూ వెళ్లి నియంత్రికను తాకి తీవ్రంగా గాయపడ్డాడు. సైనిక్‌పురిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో.. జానకి చిన్న ఉద్యోగం చేస్తూ పిల్లలను సాకుతోంది. బాలుడిని ఆదివారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్‌ సునీతాయాదవ్‌ పరామర్శించారు. ఆసుపత్రి బిల్లులు చెల్లిస్తామని,  మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు.  
* నిషాంత్‌ వైద్య ఖర్చుల నిమిత్తం సిద్ధిపేటకు చెందిన ఫార్మర్స్‌ ఫస్ట్‌ ఫౌండేషన్‌ నిర్వాహకుడు చక్రధర్‌ ఆదివారం రూ.2 లక్షలు అడ్వాన్స్‌ బిల్లు చెల్లించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని