Published : 12/04/2021 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ దీక్ష

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పంజాగుట్ట సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అంబర్‌పేటలోని తన ఇంటి వద్ద దీక్ష చేయాలని వీహెచ్‌ నిర్ణయించారు. గతేడాది అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నించే సమయంలో పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ గోషామహల్‌లో ఉంచిన ఆ విగ్రహాన్ని తనకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం పంజాగుట్ట సెంటర్‌లో ఏర్పాటు చేసే వరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని