Updated : 12/04/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మల్లాపూర్, నాచారం, ఈసీఐఎల్‌, కాప్రా, మల్కాజిగిరి, సనత్‌నగర్‌, ఎస్‌ఆర్‌ నగర్, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, అల్వాల్‌ తదితర‌ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కొన్నిచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు స్వల్ప అంతరాయం కలిగింది. ఎండల తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని