Published : 12/04/2021 23:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుప్పలు తెప్పలుగా పాముల కలకలం

కందుకూరు : ఒక్క పామును చూస్తే చాలు ఒళ్లు జలదరిస్తుంది. అదే పదుల సంఖ్యలో కంటి ముందు కనిపిస్తే.. ఇక భయంతో పరుగులు తీయడమే. రంగారెడ్డి జిల్లా కందకూరు మండలం గపూర్‌నగర్‌ గ్రామంలో రైతు దయానంద్‌ ఇంటి ఆవరణలో పదుల సంఖ్యలో పాములు కలకలం సృష్టించాయి. ఇంటి పక్కనే ఉన్న పశువుల పాక నుంచి తొలుత ఓ పాము రావడంతో దయానంద్‌ దానిని చంపేశాడు. ఆ తర్వాత ఒకదాని వెంట మరొకటి పాములు వస్తూనే ఉండటంతో భయాందోళన చెందిన రైతు స్థానికులు పాములను చంపేశాడు. అనంతరం పశువుల పాక వద్ద పుట్టలా ఉన్న చోట తవ్వగా వందకు పైగా పాము పిల్లలతో పాటు గుడ్లు బయటపడ్డాయి. ఇవి కట్ల పాములని గ్రామస్థుల గుర్తించారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని