Published : 21/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధర లేక రైతన్న దిగాలు

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు వెంకటయ్య. స్వగ్రామం బుద్దారం. గ్రామంలోనే రూ.1.2 లక్షలు చెల్లించి పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి, కంది పంటలను సాగు చేశారు. పెట్టుబడిగా రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిని పెట్టుబడులు మీదపడ్డాయి. యాసంగిలోనైనా లాభాలు పొందాలని కూరగాయలు, ఆకు కూరలపై దృష్టి సారించారు. ఎకరం విస్తీర్ణంలో కాలిఫ్లవర్‌ పంటను సాగు చేసినా, కిలో రూపాయి చొప్పున కూడా అమ్ముడు పోవడం లేదు. కూలీలు, రవాణా ఖర్చులు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో పంటను పశువులకు వదిలేసి దిగులు పడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని