Published : 21/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు: కలెక్టర్‌

దృశ్య మాధ్యమంలో మాట్లాడుతున్న పాలనాధికారిణి పౌసుమి బసు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు పాలనాధికారిణి పౌసుమి బసు తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిబంధన అమల్లో ఉంటుందన్నారు. మంగళవారం పాలనాధికారి కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా పోలీసు అధికారులు, తహాసీల్దార్లతో మాట్లాడారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు పాలానాధికారి మోతీలాల్‌, ఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, డీఎస్సీలు, సీఐలు పాల్గొన్నారు.

ఉల్లంఘిస్తే కేసులే: ఎస్పీ

వికారాబాద్‌, న్యూస్‌టుడే: రాత్రి కర్ఫ్యూను అధిగమిస్తే కేసులు తప్పవని పోలీసు అధికారి ఎం.నారాయణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మినహాయింపు పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను చూపించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసుల నమోదుతో పాటు జరిమానా విధిస్తామన్నారు.

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తాండూరు పట్టణ సీఐ రవి కుమార్‌ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై పట్టణ ప్రజలకు మంగళవారం ఆయన అవగాహన కల్పించారు.ఎస్‌ఐ గిరి, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని