Published : 21/04/2021 02:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్లా కేంద్రంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు: మంత్రి సబితారెడ్డి

మాట్లాడుతున్న సబితారెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యేలు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: జిల్లా కేంద్రంలో ఆర్టీపీసీఆర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించిందని ప్రజలకు అవగాహన కల్పించి, సహకరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కరోనా సోకిన వారు హైదరాబాద్‌ వెళ్లవలసిన అవసరం లేదని, మహవీర్‌లో 150 పకడలు, తాండూరు ఆసుపత్రిలో 45 పడకలు, పది వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండటం కష్టం అనుకున్న వారికి ఛాతీ ఆసుపత్రి, సాయి దంత వైద్య కళాశాలల్లో 90 పడకలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండో దశలో 45 వేల పరీక్షలు నిర్వహించగా 3,317 పాజటివ్‌ కేసులు నమోదయ్యాయని, నలుగురు మృతి చెందారని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. రైతుల ఇబ్బందులకు ఎదురైతే కంట్రోల్‌ రూం, టోల్‌ ఫ్రీ 180042500333, 1967 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి సక్రమంగా సరకులు అందేలా చూడాలని పౌరసరఫరాలు, విద్యాశాఖ అధికారులకు సూచించారు. విద్యావాలంటీర్ల సహకారం అందించే విషయమై సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారన్నారు. సమావేశంలో కలెక్టర్‌ పౌసుమి బసు, అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, అదనపు ఎస్పీ రషీద్‌, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌, చేవెళ్ల ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహేష్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, యాదయ్య, జడ్పీ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌ ఉన్నారు.

కేంద్రంపై ఒత్తిడి వల్లే: గత ఎన్నికల ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌లోకి మార్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కేసీఆర్‌, కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేశారని, చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్‌రెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని