Published : 21/04/2021 04:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

81 చలానాలు ఉన్న ద్విచక్ర వాహనం సీజ్‌


చలానాలను అందజేస్తున్న ట్రాఫిక్‌ ఎస్సై శ్రీనివాస్‌

పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: అల్వాల్‌ ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం కొంపల్లి సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. బి.రాంకుమార్‌కు చెందిన వాహనాన్ని అతడి సోదరుడు రాజేశ్‌ నడుపుతూ వచ్చాడు. తనిఖీలు చేయగా 81 చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. రూ.21,100 జరిమానా చెల్లించాల్సి ఉంది. ఎస్సై శ్రీనివాస్‌ సదరు వాహనాన్ని సీజ్‌ చేసి, అల్వాల్‌ ట్రాఫిక్‌ ఠాణాకు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని