Published : 21/04/2021 04:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బాలికపై అత్యాచారం.. దోషికి పదేళ్ల కారాగారం

రంగారెడ్డి జిల్లా కోర్టులు, న్యూస్‌టుడే: ప్రేమిస్తున్నానని వెంటపడి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ బాలికను అపహరించుకుపోయి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2,500 జరిమానా విధించింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం శంషాబాద్‌ మండల కేంద్రం బహదూర్‌అలీమక్త ప్రాంతానికి చెందిన గుడ మహేందర్‌(26) ప్రైవేట్‌ డ్రైవరు. 2017లో పదో తరగతి చదివే స్థానిక బాలిక(16)ను ప్రేమిస్తున్నట్లు వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి బాలికను అపహరించుకుపోయి ఓ గదిలో బంధించి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న ఆర్జీఐ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు. బాలికకు పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నేర విచారణ చట్టం సెక్షన్‌ 164 ప్రకారం రాజేంద్రనగర్‌ 17వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌తో రికార్డ్‌ చేయించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం రాజేంద్రనగర్‌ డివిజన్‌ అప్పటి ఏసీపీ కె.గంగారెడ్డి నిందితుడిపై కోర్టులో భారత శిక్షా స్మృతిలోని అపహరణ, నిర్బంధం, అత్యాచారంతోపాటు పోక్సో చట్టం కింద అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డిజిల్లా 9వ అదనపు జిల్లా సెషన్స్‌(పోక్సో ప్రత్యేక సెషన్స్‌ కోర్టు) న్యాయమూర్తి రఘునాథ్‌రెడ్డి మంగళవారం తుది తీర్పు వెలువరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని