Published : 21/04/2021 04:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్య

నాగోలు, న్యూస్‌టుడే: అత్తా మామల బాగోగులు చూసే విషయమై భర్తతో జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నాగర్‌కర్నూల్‌ జిల్లా నాగనూల్‌కు చెందిన శివమ్మ(38), జంగయ్య దంపతులు నాగోలు సాయినగర్‌లో మిర్చీ బజ్జీలు అమ్ముకుని జీవిస్తున్నారు. జంగయ్య తల్లిదండ్రులు కుంట్లూరులోని రాజీవ్‌ గృహకల్పలో ఉంటున్నారు. ఇటీవల వారు అనారోగ్యం పాలుకాగా.. చికిత్సకు రూ.20వేలు ఖర్చయ్యాయి. వారి బాగోగులు చూసేందుకు జంగయ్య ఒక్కడే ఎందుకు ఖర్చుచేయాలనే విషయమై శివమ్మ భర్తను నిలదీయడంతో గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన జంగయ్య భార్యపై చేయిచేసుకున్నాడు. అనంతరం సరకులు తెచ్చేందుకు బజారుకు వెళ్లగా శివమ్మ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని