Published : 21/04/2021 04:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గతేడాది 59 మంది ప్రాణాల్ని రక్షించాం

అగ్నిమాపక శాఖ ర్యాలీలో డైరెక్టర్‌ వెల్లడి


జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ లక్ష్మిప్రసాద్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నారాయణరాజు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా మంటలను ఆర్పేందుకు ఉపయోగించే వాటర్‌ టెండర్స్‌, మల్టీపర్పస్‌ టెండర్స్‌, బ్రాంటో స్కై లాంటి 20 రకాల అగ్నిమాపక వాహనాలతో ర్యాలీ చేపట్టారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌ నుంచి మెహిదీపట్నం, కోఠి, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, తార్నాక మీదుగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వరకు ర్యాలీ సాగింది. శాఖ సంచాలకులు లక్ష్మిప్రసాద్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ఏడాది వారం రోజుల పాటు వాణిజ్య సముదాయాలు, రెస్టారెంట్లు, అపార్టుమెంట్స్‌, హాస్పిటల్స్‌ ఇలా వేర్వేరు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. గత ఏడాది పలు ప్రమాదాల నుంచి 59 మంది ప్రాణాలు కాపాడామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జి.వి.నారాయణరాజు, రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ కె.పాపయ్య, రంగారెడ్డి జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని