Updated : 21/04/2021 05:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అధిక ధరలకు రెమ్‌డెసివిర్‌ విక్రయాలు

మూడు ఘటనల్లో ఎనిమిది మంది అరెస్ట్‌

బోయిన్‌పల్లి, నాంపల్లి ముర్గీ మార్కెట్‌లలో దొరికిన నిందితులు

కంటోన్మెంట్‌, ఆసిఫ్‌నగర్‌, మెహిదీపట్నం, న్యూస్‌టుడే: నగరంలో మూడు వేర్వేరు చోట్ల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న నిందితులను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఓల్డ్‌ బోయిన్‌పల్లి మిలిటరీ డెయిరీ ఫారం రోడ్డులో ఈసీఐఎల్‌ శ్రీకర ఆసుపత్రిలో ఫార్మసిస్టు, కీసర మండలం రామపురానికి చెందిన ఎం.మధుగౌడ్‌(25), అదే ఆసుపత్రిలో నర్సు, నాగారానికి చెందిన జి.సాయిచంద్‌(20), మెడికల్‌ రిప్రజంటేటివ్‌, పూర్ణోదయకాలనీకి చెందిన ఐ.సురేశ్‌(40), పాల కేంద్రం నిర్వాహకుడు, ఎల్బీనగర్‌కు చెందిన సైదులు(31)లు బోయిన్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా.. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.21వేలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించారు. వారినుంచి నాలుగు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.

*● నాంపల్లి ముర్గీ మార్కెట్‌ సమీపంలో సర్దార్‌ మెడికల్‌ దుకాణం యజమాని మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌(52), కాగజ్‌కా కార్ఖానాకు చెందిన షేక్‌ జిలానీ(27), నాంపల్లి నివాసి మహ్మద్‌ బిన్‌ సలీం(51)ను.. మధ్య మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకుని, హబీబ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.23 వేలకు విక్రయిస్తున్నట్లు తేలింది. నాలుగింటిని స్వాధీనం చేసుకున్నారు. ●

* యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌కు చెందిన షేక్‌ మజహర్‌ స్థానికంగా గ్లోబల్‌ ఫార్మసీ నిర్వహిస్తున్నాడు. ఒక్కో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను రూ.35 వేలకు విక్రయిస్తున్నాడు. పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్సు పోలీసులు అతన్ని పట్టుకుని లంగర్‌హౌస్‌ పోలీసులకు అప్పగించారు. ఆరు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని