Published : 21/04/2021 05:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలి

దర్గాలో పూల చాదర్‌ సమర్పించిన మహమూద్‌ అలీ


ప్రార్థనలు నిర్వహిస్తున్న హోంమంత్రి, మహ్మద్‌ సలీం తదితరులు

నాంపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ మంగళవారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ మహ్మద్‌ సలీం నాంపల్లి యూసుఫ్‌బాబా దర్గాలో పూల చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర హజ్‌ కమిటీ ఛైర్మన్‌ మసిఉల్లాఖాన్‌, తెరాస నాంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సీహెచ్‌. ఆనంద్‌కుమార్‌గౌడ్‌, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎం కోలుకోగానే ఎల్లమ్మ తల్లికి బోనం తీస్తా


ఎల్లమ్మ తల్లికి పూజలు చేస్తున్న శ్రీనివాస్‌గుప్తా

 

నాగోలు, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని కోరుతూ తెలంగాణ టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా మంగళవారం అంబర్‌పేటలోని ఎల్లమ్మ తల్లికి ముడుపుకట్టి పూజలు చేశారు. సీఎం కు నెగిటివ్‌ వచ్చిన వెంటనే ఎల్లమ్మ తల్లికి బోనం తీసి మొక్కు చెల్లించుకుంటానని ఆయన తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని