Published : 05/05/2021 06:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార్యపై అనుమానంతో కొట్టి చంపిన భర్త


స్వప్న

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: భర్త అనుమానం భార్య ప్రాణాలను బలిగొంది. భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోందని అనుమానంతో విచక్షణ కోల్పోయి తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుని కన్నుమూసింది. ఈ దారుణం పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన స్వప్న (31) అదే గ్రామానికి చెందిన సురేష్‌తో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్‌ భార్య స్వప్నపై కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి సురేష్‌ ఇంటికి వచ్చేసరికి భార్య స్వప్న ఫోన్‌లో మాట్లాడుతోంది. దీంతో అనుమానం పెంచుకున్న అతడు భార్యను తీవ్రంగా కొట్టిగాయపరిచాడు. గాయపడిన స్వప్న అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమెను ఇస్నాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని