Updated : 05/05/2021 05:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్థిక ఇబ్బందులతో కానిస్టేబుల్‌ బలవన్మరణం

బానోతు అభిలాష్‌ నాయక్‌

సైదాబాద్‌, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులు.. మానసిక వ్యథతో ఓ కానిస్టేబుల్‌ గొంతు కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మలక్‌పేట పోలీస్‌ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ముసారాంబాగ్‌ డివిజన్‌ సలీంనగర్‌ పరిధి బాలదానమ్మ బస్తీలో నివసించే అభిలాష్‌ నాయక్‌(33) కానిస్టేబుల్‌. 2011లోనే తన మేనమామ కుమార్తె ఇంద్రజ్యోతితో వివాహమైంది. వీరికి ధీరజ్‌, హేమంత్‌ అనే కుమారులు ఉన్నారు. ఆరేళ్లుగా మాదన్నపేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అభిలాష్‌.. భారీగా అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు అధికం కావటంతో మానసిక వేదనకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం భార్య, పిల్లలను కోదాడలోని పుట్టింట్లో వదిలి వచ్చాడు. సోమమధ్యాహ్నం భోం చేసి రెండో అంతస్తులోని గదిలో పడుకుంటానని తల్లితో చెప్పి వెళ్లాడు. తర్వాత కిందికి రాలేదు. రాత్రి పదింటికి సోదరుడు ప్రభు వెళ్లి చూడగా గది తలుపు మూసి ఉంది. ఎంతకు సమాధానం రాకపోవడంతో స్థానిక యువకుడు అశోక్‌తో కలిసి తలుపు బద్ధలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా అభిలాష్‌ రక్తపుమడుగులో మంచం కింద విగతజీవిగా పడి ఉన్నాడు. అప్పటికే మరణించడంతో పోలీసులకు సమాచారం అందించారు. తొలుత బ్లేడుతో ఎడమ చేయి మణికట్టు, తర్వాత గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని