పనుల్లో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్‌
logo
Published : 12/05/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పనుల్లో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్‌


ధాన్యాన్ని పరిశీలిస్తున్న పాలనాధికారిణి పౌసుమిబసు

బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: గ్రామాల్లో కొనసాగుతున్న పనులపై నిర్లక్ష్యం చూపకుండా త్వరగా పూర్తి చేయాలని జిల్లా పాలనాధికారిణి పౌసుమిబసు అన్నారు. మంగళవారం మండలంలోని బుర్రితండా, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటిస్తూ ఉపాధి పనులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. శ్మశాన వాటిక నిర్మాణాలు, డంపింగ్‌ యార్డు పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకరావాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతులు ఒకే సారి కాకుండా కేంద్రాల వద్ద నిల్వ చేసుకునేందుకు స్థల అనుకూలతను గుర్తించి తీసుకరావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచులు హన్మంతు, చంద్యానాయక్‌, ఎంపీటీసీ సభ్యుడు నర్సింహ, ఎంపీడీఓ పవన్‌కుమార్‌, ఎంపీఓ పాండు తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని