320 మందికి కరోనా
logo
Published : 12/05/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

320 మందికి కరోనా

 

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో 1,112 మందికి మంగళవారం యాంటిజన్‌ పరీక్షలు నిర్వహించగా 320 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జిల్లా ఆసుపత్రి, ఆయా సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.


జూమ్‌ మీటింగ్‌ ద్వారా మాట్లాడుతున్న ఎమ్మెల్యే

కట్టడికి కలిసి పనిచేద్దాం: ఆనంద్‌

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: కరోనా కట్టడికి కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే ఆనంద్‌ అన్నారు. మంగళవారం వికారాబాద్‌లోని తన నివాసంలో మోమిన్‌పేట మండల ప్రజాప్రతినిధులతో జూమ్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన పది రోజుల లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలని అన్నారు. కరోనా సోకిన వారిని ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రతి రోజూ పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సర్పంచులు, పీఏసీఎస్‌ ఛైర్మన్లు పాల్గొన్నారు.

బాధితురాలితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

ఆందోళన వద్దు: రోహిత్‌రెడ్డి

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): ఆందోళన వద్దు, ఆత్మస్థైర్యంతో ఉండాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి కరోనా బాధితులకు మనోధైర్యాన్ని కల్పించారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రంలోని కొవిడ్‌ కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. పీపీఈ కిట్‌ ధరించి కొవిడ్‌ ఐసొలేషన్‌ వార్డులో పర్యటించారు. వార్డులో వివిధ దశల్లో చికిత్స పొందుతున్న బాధితులను పలకరించారు. ఆయన వెంట వైద్యాధికారులు, నాయకులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని