గ్రామీణ రహదారులకు మోక్షమెప్పుడో!
logo
Published : 12/05/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్రామీణ రహదారులకు మోక్షమెప్పుడో!

నిధులు మంజూరైనా కొనసాగని పనులు

రాకపోకలకు తప్పని ఇబ్బందులు


చెంగోల్‌-పర్వతాపూర్‌ రోడ్డు దుస్థితి

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ: గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది నిధులు మంజూరు చేసింది. టెండరు ప్రక్రియ పూర్తి చేయించిన అధికారులు ఇప్పటివరకు పనులు మొదలు పెట్టించడం లేదు. కరకరతేలిన మార్గాల్లోనే రాకపోకలకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో 566 గ్రామ పంచాయతీలకు అనుసంధానంగా 200పైగా గ్రామాలు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా రోడ్లు దెబ్బతిన్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు మరింత అధ్వానంగా మారాయి. కంకరతేలి గుంతలు పడి తారు తుడిచిపెట్టుకుపోయింది. తాండూరు మండలం సంగెంకలాన్‌, వీర్‌శెట్టిపల్లి, సిరిగిరిపేట మార్గం వరదలో కొట్టుకుపోయింది. వీటి మరమ్మతులు, కొత్తగా నిర్మాణాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు.

గతేడాది: గతేడాది సడక్‌ యోజన పథకం కింద గ్రామీణ రహదారుల నిర్మాణానికి రూ.కోట్లలో నిధులు మంజూరయ్యాయి. వాటిని వేసవిలోగా నిర్మింపజేసి పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు అందుబాట్లోకి తేవాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో రహదారుల నిర్మాణాలు టెండర్లకే పరిమితం చేశారు. పనులు చేపట్టకపోవడంతో రహదారులు దస్త్రాల్లోనే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వేసవి అనుకూలం కావడంతో నిర్మించే వీలుండేది. జూన్‌లో వర్షాకాలం మొదలైతే మరి కొన్ని నెలలపాటు ఆగాల్సిందే. అధికారులు వెంటనే టెండర్లు పూర్తైన వాటి పనులు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

నాలుగు నెలల్లో అందుబాటులోకి: వెంకట్రావ్‌, డీఈ, తాండూరు.

గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద మంజూరైన తారు రహదారు పనులను నాలుగు నెలల్లో పూర్తి చేయిస్తాం. పెద్దేముల్‌ మండలంలో ఈ మధ్యే ప్రారంభమయ్యాయి. తాండూరు మండలంలో రెండురోజుల్లోగా ప్రారంభింపజేస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని