Published : 12/05/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విత్తనాలను పంట సాగుకు ముందే వేయండి: ఎమ్మెల్యే


విత్తనాలను అందజేస్తున్న మహేష్‌రెడ్డి

కుల్కచర్ల, న్యూస్‌టుడే: ప్రభుత్వం అందజేస్తున్న జీలుగ, జనుము విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలో ఆగ్రోస్‌ సేవా కేంద్రంలో రాయితీపై రైతులకు విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాలను పంట సాగుకు ముందే వేయడం ద్వారా భూమి సారవంతంగా మారి అధిక దిగుబడికి అవకాశం ఉంటుందన్నారు. దీనికి తోడు రసాయనిక ఎరువుల వినియోగం తగ్గిపోతుందని చెప్పారు.

చెక్కుల పంపిణీ: తహసీల్దార్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని