నిర్మాణ పనులకు మినహాయింపు
logo
Published : 12/05/2021 03:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్మాణ పనులకు మినహాయింపు

కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

సామగ్రి వాహనాలకు ఉదయం పది తర్వాతే అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌

నిర్మాణ రంగానికి ఈసారి లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు దక్కింది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారమే స్థిరాస్తి వర్గాలు సమాచారం అందుకున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో పాటించాల్సిన ప్రొటోకాల్స్‌పైన పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పనులు కొనసాగించుకోవచ్చని అధికారులు సూచించారు. నిర్మాణ కూలీల ఉపాధికి ఢోకా ఉండదని, వలసపోయే పరిస్థితి రాదని నిర్మాణదారులు అంటున్నారు.

యథావిధిగా కొనసాగించొచ్చు..

* నిర్మాణ పనులను యథావిధిగా కొనసాగించుకోవచ్ఛు కూలీలను సైట్లకు తరలించేటప్పుడు, పని ప్రదేశంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. లాక్‌డౌన్‌ సమయంలో స్టీలు, సిమెంట్‌, ఇటుక, ఇతర నిర్మాణ సామగ్రిని తరలించే వాహనాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. వీటిలో ప్రయాణికులను తరలించవద్ధు

* గత ఏడాది లాక్‌డౌన్‌తో కొన్నినెలల పాటూ ఇళ్లు, వాణిజ్య, కార్యాలయాల భవన నిర్మాణ ప్రాజెక్టులన్నీ మధ్యలోనే నిలిచిపోయాయి. అనంతరం అన్‌లాక్‌ ప్రకటించినా.. స్వస్థలాలకు వెళ్లిన కూలీలు తిరిగి వచ్చేందుకు ఆరునెలలకుపైగానే పట్టింది. ఈ ప్రభావం నిర్మాణాలపై పడింది. ఏడాది ఆలస్యంగా పనులు నడుస్తున్నాయి.

* నిర్మాణ పనులకు చేరువలోనే బిల్డర్లు.. కూలీల నివాస సముదాయాలను ఏర్పాటు చేశారు. ఒక్కోచోట 500 నుంచి వెయ్యి, రెండువేల వరకు ఉంటున్నారు. ఉదయం నుంచి రాత్రివరకు షిప్టుల వారీగా పనులు చేస్తుంటారు. లాక్‌డౌన్‌తో వీరంతా క్వార్టర్లకే పరిమితమైతే.. కాపాడుకునేది ఎలా అనే ఆందోళన నిర్మాణదారుల్లో కనబడింది. ఆంక్షలు లేకపోవడంతో ఇప్పుడు వీరంతా ఇదివరకు మాదిరే పనులకు హాజరుకావచ్చు.

* కూలీల్లో అత్యధికులు కుటుంబాలను వదిలి పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన వారే. బిహార్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి వచ్ఛి. వేర్వేరు చోట్ల పనులు చేస్తుంటారు. వేర్వేరు వృత్తుల్లో ఐదు లక్షల మంది వరకు ఉంటారు. వీరిలో అత్యధికం భవన నిర్మాణ రంగంలోనే పనిచేస్తున్నారు.

* సామాజిక మాధ్యమాల్లో గమనించిన అంశాలను అన్వయించుకోవద్దు

* చెబుతున్న వ్యక్తుల అర్హతలను గమనించాలి

* ఏదైనా అనుమానం ఉంటే సమీపంలోని వైద్యుల వద్ద నివృత్తి చేసుకోవాలి

* మీకు వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకోకుండా ఇతరులకు పంపవద్దు

* ఒత్తిడి కలిగించే అంశాలను ప్రచారం చేసే సామాజిక మాధ్యమాల గ్రూపుల నుంచి వైదొలగండి

ప్రభుత్వానికి ధన్యవాదాలు..

- జి.రాంరెడ్డి, క్రెడాయ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ క్రెడాయ్‌ ఛైర్మన్‌

లాక్‌డౌన్‌ నుంచి నిర్మాణరంగానికి మినహాయింపు ఇవ్వాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశాం. మా అభ్యర్థనను మన్నించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. పనుల ప్రొటోకాల్స్‌పై సైబర్‌బాద్‌ సీపీ సజ్జనార్‌తో సమావేశమయ్యాం. ఉదయం 6 నంచి పది మధ్యలో నిర్మాణ వాహనాలు తిరగకుండా చూసుకోండని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని