భార్య మృతిని తట్టుకోలేక ఆగిన భర్త గుండె
logo
Published : 12/05/2021 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార్య మృతిని తట్టుకోలేక ఆగిన భర్త గుండె


దయానంద్‌

కీసర, న్యూస్‌టుడే: వారిది నిరుపేద కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. కరోనా లక్షణాలతో భార్య మృతి చెందగా.. మరణాన్ని జీర్ణించుకోలేని భర్త గుండెపోటుతో మూడు గంటల వ్యవధిలో కన్నుమూశారు. ఈ హృదయ విదారక ఘటన మేడ్చల్‌ జిల్లా కీసరలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కీసరలో నివసించే గోగికర్‌ దయానంద్‌(65), రాణిభాయ్‌(58) భార్యాభర్తలు. మూడు రోజుల క్రితం భార్య రాణిభాయ్‌కి తీవ్ర జ్వరం వచ్చింది. ఎంతకూ తగ్గక పోవడంతో ప్రైవేటులో కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించారు. రిపోర్టు రాక ముందే ఆమెకు ఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు సోమవారం ఆమెను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఎక్కడా బెడ్లు ఖాళీగా లేవు.. ఆక్సిజన్‌ అందుబాటులో లేదని వెనక్కి పంపించారు. చేసేదేమీలేక మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందారు. కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహిస్తుండగానే భార్య మృతిని తట్టుకోలేక భర్త గుండెపోటుకు గురై కుప్ప కూలిపోయారు. కొవిడ్‌ పరీక్ష ఫలితాలు రాకముందే సతీపతులు మృతి చెందడం పలువురిని కలిచివేసింది. వారికి అయిదుగురు కూతుళ్లు. ఒక కొడుకు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. దయానంద్‌ మేకలు, గొర్రెల మాంసం విక్రయించి జీవనం సాగించేవారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని