Corona: టీఎస్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కీలక భేటీ
logo
Published : 12/05/2021 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: టీఎస్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కీలక భేటీ

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కీలక సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. కమిటీ ఛైర్మన్‌, మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌తో పాటు సీఎంవో ప్రత్యేకాధికారి రాజశేఖర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. పాజిటివ్‌ రోగుల చికిత్సకు కావాల్సిన ఔషధాలు, ఆక్సిజన్‌, ఇతర నిల్వలకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నారు. రెమిడెసివిర్‌ సహా ఇతరత్రా ప్రాణాధార ఔషధాలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి?ఇంకా ఎన్ని సమకూర్చుకోవాలి? రోజువారీ సరఫరా ఎలా కొనసాగుతోంది? ఏ జిల్లాలో ఎంత అవసరముంది? అనే అంశాలపై పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్నారు. రోజువారీ ఆక్సిజన్‌ అవసరం.. కేంద్రం కేటాయించిన కోటాపై సరఫరా ఎలా కొనసాగుతోందనే అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. కరోనా టీకాల కొనుగోలుకు గ్లోబల్‌ టెండర్లకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయంచిన నేపథ్యంలో దానిపైనా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమీక్షించనుంది. సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కేటీఆర్‌ మీడియాకు వెల్లడించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని