హైదరాబాద్‌ విద్యార్థినికి రూ.2 కోట్ల కొలువు
logo
Updated : 16/05/2021 09:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌ విద్యార్థినికి రూ.2 కోట్ల కొలువు


దీప్తి

ఈనాడు, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థినికి అమెరికాలోని సియాటెల్‌ మైక్రోసాఫ్ట్‌ ప్రధాన కార్యాలయంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం లభించింది. వార్షిక వేతనం రూ.2 కోట్లు. యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాలో ఈనెల 2న ఎంఎస్‌(కంప్యూటర్స్‌) పూర్తిచేసిన దీప్తి క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికయ్యారు. ఈనెల 17న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె తండ్రి డాక్టర్‌ వెంకన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో క్లూస్‌టీం విభాగాధిపతిగా ఉన్నారు. బీటెక్‌ తర్వాత జేపీ మోర్గాన్‌లో సాఫ్ట్‌వేర్‌ఇంజినీర్‌గా చేరిన యువతి మూడేళ్లు పనిచేశాక రాజీనామా చేసి ఎంఎస్‌ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఫ్లోరిడా యూనివర్సిటీలో ఎంపికైన 300మందిలో దీప్తికి అత్యధిక వార్షిక వేతనం లభించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని