TS News: అవినీతి చిట్టా తీస్తున్నాం: బండి సంజయ్‌
eenadu telugu news
Published : 08/06/2021 01:17 IST

TS News: అవినీతి చిట్టా తీస్తున్నాం: బండి సంజయ్‌

కమలాపూర్‌: రాష్ట్రంలో రాజకీయాలు మారబోతున్నాయని.. ప్రక్షాళన ప్రారంభమైందని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రగతి భవన్‌ తెలంగాణ ద్రోహులకు అడ్డాగా మారిందన్నారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను తీస్తున్నామన్నారు. ఉద్యమకారుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తీసుకున్న చర్యలు అవినీతి ఎమ్మెల్యేలపై తీసుకుంటే ఒక్కరూ కూడ మిగలరని వ్యాఖ్యానించారు. గడీల పాలనను తట్టుకోలేక బయటకు వచ్చిన వారు అవినీతి పరులా? అని సంజయ్‌ ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైసలాట ప్రారంభమైందని ఆయన ఎద్దేవా చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని