TS News: 22 ప్రైవేట్‌ ఆస్పత్రులకు మళ్లీ కొవిడ్‌ అనుమతులు
eenadu telugu news
Updated : 09/06/2021 15:22 IST

TS News: 22 ప్రైవేట్‌ ఆస్పత్రులకు మళ్లీ కొవిడ్‌ అనుమతులు

హైదరాబాద్‌: కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న అభియోగాలపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ సేవల లైసెన్సులు రద్దైన 22 ఆస్పత్రుల లైసెన్సులను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు ఆస్పత్రుల లైసెన్సులను పునరుద్ధరిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల లైసెన్సులను రద్దు చేయటం ద్వారా వైరస్ బాధితులకు సేవలు అందిస్తున్న ఇతర ప్రైవేటు ఆస్పత్రులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునట్టు ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు వారిపై వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించుకోవటంతో పాటు బాధితుల నుంచి వసూలు చేసిన అధిక ఫీజులను రెండు వారాల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. మరోసారి అధిక ఛార్జీలు వసూలు చేయరాదని ప్రైవేటు ఆస్పత్రులకు స్పష్టం చేసింది. ఇదే తరహా పరిస్థితులు పునరావృతమైతే ఆయా ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేసి యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. దీంతో గతంలో కొవిడ్ లైసెన్సులు రద్దైన 22 ఆస్పత్రులు తిరిగి కరోనా వైద్య సేవలను అందించనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని