TS News: రూ.50లక్షల పరిహారం ఇవ్వాలి: జీవన్‌రెడ్డి
eenadu telugu news
Published : 09/06/2021 13:27 IST

TS News: రూ.50లక్షల పరిహారం ఇవ్వాలి: జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌: కరోనా ఉచిత చికిత్సలో తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేయడం లేదని ఆక్షేపించారు. అసెంబ్లీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. కరోనాతో పేదల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని.. ఇప్పటి వరకు కొవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చలేదని విమర్శించారు. గచ్చిబౌలి టిమ్స్‌లో సీటీస్కాన్‌ వసతి కూడా లేదన్నారు. కరోనా థర్డ్‌వేవ్‌పై హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని విమర్శించారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని