తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు
logo
Updated : 10/06/2021 17:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్‌: ఈ నెల 5న తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో మరింత బలపడి ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తాయని.. రాగల మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తామని తెలిపింది. ఇవాళ, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని