Ts News: పెళ్లిలో హిజ్రాల హల్‌చల్‌
logo
Published : 18/06/2021 01:32 IST

Ts News: పెళ్లిలో హిజ్రాల హల్‌చల్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ పరిధిలోని నేరెడ్‌మెట్‌లోని ఓ పెళ్లిలో హిజ్రాలు హల్‌చల్‌ చేశారు. పెళ్లి వారింటికి వెళ్లి రూ. 50వేలు డిమాండ్‌ చేశారు. వారు డబ్బులు ఇవ్వకపోవడంతో దుస్తులు విప్పి హంగామా చేశారు. అంతటితో ఆగకుండా శుభకార్యానికి వచ్చిన బంధువులపై దాడికి పాల్పడ్డారు. బాధితులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న నేరెడ్‌మెట్‌ పోలీసులు హిజ్రాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా దుస్తులు విప్పి పోలీసులపై వారి ప్రతాపం చూపించారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి అసభ్యంగా ప్రవర్తించిన నలుగురు హిజ్రాలపై 506, 448 సెక్షన్లు, 188, 51(b) విపత్తు నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని