TS News: నీటి ట్యాంకులో విగతజీవిగా చిన్నారి
logo
Updated : 18/06/2021 10:54 IST

TS News: నీటి ట్యాంకులో విగతజీవిగా చిన్నారి

అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇంటిపై ఉన్న నీటి ట్యాంకులో 2 నెలల చిన్నారి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రంగయ్య కుమార్తె బాలమణి రెండు నెలల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో రోజు మాదిరిగా గురువారం రాత్రి బాలుడితో పాటు కుటుంబ సభ్యులంతా ఇంట్లో నిద్రించారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయినా బాలుడి ఆచూకీ తెలియలేదు.

దీంతో పోలీసులకు సమాచారం అందించటంతో వారు ఘటనాస్థలికి వెంటనే చేరుకొని గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అనంతరం ఇంటిపైన వెతకగా నీటి ట్యాంకులో విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతి విషయంలో కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తమవుతోంది.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని