యూట్యూబ్‌ చూసి.. నకిలీనోట్లు తయారు చేసి
logo
Updated : 18/06/2021 16:04 IST

యూట్యూబ్‌ చూసి.. నకిలీనోట్లు తయారు చేసి

హైదరాబాద్‌: ఎవరైనా వినోదం కోసం యూట్యూబ్‌ చూస్తారు లేదా విద్యను అభ్యసించేందుకు చూస్తారు. కానీ, ఓ వ్యక్తి యూట్యూబ్‌లో నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలో నేర్చుకుని కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పఠాన్‌చెరువు జేపీ కాలనీకి చెందిన ఉప్పరి రాజుప్రసాద్‌ అలియాస్‌ రాజు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దొంగ నోట్ల చెలామణి మొదలుపెట్టాడు.

పఠాన్‌ చెరువు, మండవల్లి, ఏలూరు, బాచుపల్లి, సంగారెడ్డిలో దొంగనోట్లు చెలామణి చేస్తూ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బయటకు వచ్చాక కూడా బుద్ధిమారని రాజుప్రసాద్‌ ఓఎల్‌ఎక్స్‌లో కలర్‌ ప్రింటర్‌ కొనుగోలు చేసి, దానిని ఉపయోగించి రెండు వేల రూపాయల నోట్లు ముద్రించాడు. అందులో నుంచి.. ఇస్నాపూర్‌లోని చెప్పుల దుకాణంలో ఓ నోటును మార్చిన రాజు... కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హోటల్‌లో నకిలీ నోట్లు మారుస్తూ పట్టుబడ్డాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి దగ్గర నుంచి 14 నకిలీ రెండువేల రూపాయల నోట్లు, కలర్‌ ప్రింటర్‌ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని