లారీ ఢీకొని యువ వైద్యుడి మృతి
logo
Published : 18/06/2021 20:40 IST

లారీ ఢీకొని యువ వైద్యుడి మృతి

కొంపల్లి: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న వైద్యుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన మేడ్చల్‌ జిల్లా కొంపల్లిలో జరిగింది. మేడ్చల్‌ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన రమేష్‌ (41) సుచిత్రలోని హర్ష ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఈరోజు సాయంత్రం విధులు ముగించుకొని  ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా కొంపల్లి ఫ్లైఓవర్‌పై ఓ గేదె అడ్డురావడంతో ఢీకొని కిందపడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ టైరు కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని