హలధారే.. హమాలీ
logo
Published : 19/06/2021 00:47 IST

హలధారే.. హమాలీ

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కర్షకుల అవస్థలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వానలు కురుస్తాయని, కేంద్రాలు మూతపడే సమయం దగ్గర పడుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. వారే కేంద్రాల్లోని తమ ధాన్యాన్ని తూకం వేసుకుని అందుబాటులోని గోదాం వరకు చేర్చుకుంటున్నారు. బొంరాస్‌పేటలోని ఐకేపీ కేంద్రంలో నాలుగైదు రోజులుగా ఇదే విధంగా జరుగుతోంది. శుక్రవారం తూకం చేసిన బస్తాలను అక్కడున్న గోదాంలో వేయటానికి అన్నదాతలే బస్తాలను మోశారు.

- న్యూస్‌టుడే, బొంరాస్‌పేట


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని