రోస్టర్‌ పాటిస్తూ పీహెచ్‌డీ ప్రవేశాలు
logo
Published : 19/06/2021 01:38 IST

రోస్టర్‌ పాటిస్తూ పీహెచ్‌డీ ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ ప్రవేశాలను రోస్టర్‌ ప్రకారం చేపట్టి పూర్తి చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఆదేశించింది. గతేడాది ఫిబ్రవరిలో పీహెచ్‌డీలో ప్రవేశాలకు జేఎన్‌టీయూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏడాది కిందట 184 పార్ట్‌టైం, 44 ఫుల్‌టైం పీహెచ్‌డీ కోర్సులలో సీట్లు భర్తీకి నిర్ణయించింది. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. ఇందులో రోస్టర్‌ సరిగా పాటించలేదని పలువురు విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించగా రోస్టర్‌ పాటిస్తూ ప్రవేశాలు చేసుకోవచ్చని మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. లిఖితపూర్వక ఆదేశాలు లేవని పీహెచ్‌డీ పరీక్ష ఫలితాలను జేఎన్‌టీయూ అధికారులు నిలిపివేశారు. దీనిపై ఈ నెల 17న ‘ఈనాడు’లో ‘పీహెచ్‌డీ.. ప్రవేశాలు ఎప్పుడండీ?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌.. శుక్రవారం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని