రైలు కిందపడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య
logo
Published : 19/06/2021 02:04 IST

రైలు కిందపడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్‌ జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన ఆనందం శివప్రసాద్‌(40) సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హయత్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో నుంచే విధులు నిర్వహిస్తున్నారు. టీకా తీసుకుంటానని చెప్పి గురువారం ఇంటినుంచి బయటకు వచ్చారు. అదేరోజు సాయంత్రం ఘట్‌కేసర్‌- బీబీనగర్‌ మధ్య రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలానికి కొంత దూరంలో వాహనాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుడి సోదరుడు శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చి విచారించారు. వారు ఉస్మానియా మార్చురీకి తీసుకుని వెళ్లి మృతదేహాన్ని చూపించగా.. శివప్రసాద్‌గా గుర్తించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని