జైలుకెళ్లినా మానని గొలుసు చోరీలు
logo
Published : 19/06/2021 02:04 IST

జైలుకెళ్లినా మానని గొలుసు చోరీలు

జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి వివరాలను వెల్లడించారు. యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూర్‌ మండలం ఆత్మకూరుకు చెందిన కట్టోజు సందీప్‌చారి(22) జవహర్‌నగర్‌లోని బాలాజీనగర్‌కు వలసొచ్చారు. గతంలో తన స్నేహితుడు అవినాష్‌తో కలిసి రుణం తీసుకొని మొబైల్‌ దుకాణం ప్రారంభించాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో సులువుగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా చోరీల బాటపట్టాడు. జనవరిలో జవహర్‌నగర్‌ పరిధిలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి జైలుకెళ్లొచ్చాడు. అనంతరం ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలకు పాల్పడ్డాడు. మార్చి నుంచి జూన్‌ 10 వరకు వరుసగా జవహర్‌నగర్‌ పరిధిలో 6 గొలుసు చోరీలు చేశాడు. శుక్రవారం యాప్రాల్‌ కూడలిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సందీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.4 లక్షల విలువైన 80 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని