దేశపతి శ్రీనివాస్‌ పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా
logo
Published : 19/06/2021 02:04 IST

దేశపతి శ్రీనివాస్‌ పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా

నారాయణగూడ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కార్యాలయం (ఓఎస్డీ) అధికారి దేశపతి శ్రీనివాస్‌ పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా తెరిచి, స్నేహితుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారంటూ ఆయన పీఏ కె.స్వామి శుక్రవారం హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రకరకాల కారణాలు చెబుతూ ఫలానా ఖాతాలో నగదు జమ చేయాలంటూ దేశపతి స్నేహితులకు పోస్టులు వెళ్లినట్లుగా పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆ నకిలీ ఖాతాను సదరు వ్యక్తులు తొలగించినట్లుగా సైబర్‌ పోలీసులు గుర్తించారు.

* మోర్‌ కెమిస్ట్‌ పేరిట మోసాలు..: తమ మందుల దుకాణం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను మోసం చేస్తున్నారంటూ మోర్‌ కెమిస్ట్‌ అండ్‌ డ్రగిస్ట్‌ నిర్వాహకులు సచిన్‌ మోర్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత సంస్థ పేరుతో ఇండియా మార్ట్‌లో కరోనా మందులు అమ్ముతామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారని, ఇప్పటికే పలువురు మోసపోయినట్లుగా తమ దృష్ట్టి వచ్చిందన్నారు. ఈ చర్యలను అరికట్టాలంటూ ఆయన పోలీసులను కోరారు. కేసు దర్యాప్తులో ఉంది.

* బ్లాక్‌ ఫంగస్‌ మందులు పంపిస్తామని..: కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ మందు అవసరం కాగా..ఆయన కుమారుడు ఆ మందు ఎక్కడ దొరుకుతుందో గూగుల్‌లో వెదికారు. ఓ ఫార్మసీలో ఉన్నట్లు తెలిసి వెంటనే సంప్రదించారు. అవసరమైనన్ని డోస్‌లు పంపిస్తామని, రూ.1.40 లక్షలు ముందుగానే పంపించాలని అవతలి వ్యక్తి చెప్పాడు. బాధితుడు ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ చేశారు. ఆ తర్వాత మోసగాడు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసేశాడు. బాధితుడు సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని